Thursday, 20 August 2020

చాలా కాలం తర్వాత.. అలా ఆఫీసుకు వెళ్లిన అల్లు అర్జున్

కరోనా కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఎక్కడా ఎలాంటి హడావుడి లేకుండా పోయింది. పొద్దున్న లేచింది మొదలు ఎక్కడ ఎవరికి కరోనా వచ్చిందోనన్న భయంతోనే అంతా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే షూటింగులు సైతం బంద్ కావడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. నెలల నుంచి ఇంట్లోనే ఉంటూ తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ స్టార్ హీరోలెవరూ షూటింగులకు వెళ్లే సాహసం చేయడం లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అలా బయటకు వచ్చారు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిందో ఏమో కాని...హైదరాబాద్‌లోని తన నిర్మాణ సంస్థ అయిన ఆఫీసుకు వెళ్లారు. అయితే ఆఫీసులో కూడా బన్నీకి ఎలాంటి సందడి కనిపించలేదు. ఈ విషయాన్ని బన్నీయే స్వ‌యంగా ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. "చాలా కాలం త‌ర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్క‌డ ఎలాంటి హడావుడి లేదు. క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన ఈ‌ గ‌డ్డు ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే అంతం కావాలి" అని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. అయితే గీతా ఆర్ట్స్ ఆఫీసు దగ్గర దిగిన ఫోటోల్ని కూడా బన్నీ ఈ సంద‌ర్భంగా షేర్ చేశారు. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, పెరిగిన జుట్టు, గ‌డ్డంతో ఆఫీసు ఆవరణలో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. Read More: ఈ లుక్‌లో బ‌న్నీని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. కొత్త లుక్‌లో కనిపించావన్న అంటూ కొందరు అభిమానులు ఆయనకు మెసేజులు పెడుతున్నారు. అప్ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరొకరు తొందరగా షూటింగ్ ప్రారంభించాలని కోరారు. ఇలా బన్నీ అభిమానులంతా బన్నీ తాజాగా చేసిన పోస్టును చూసి రిప్లై ఇస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31b2B0Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...