Thursday, 20 August 2020

Nani V: ఇక నేరుగా నేనే మీ ఇంటికొస్తున్నా.. లెట్ ది ఫన్ బిగిన్.. నాని అఫీషియల్ స్టేట్‌మెంట్

ఇక నేరుగా నేనే మీ ఇంటికొస్తున్నా అంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు నాచురల్ స్టార్ నాని. ఈ ఒక్క మాటతో అందరికీ అర్థమయ్యిందనుకుంటా.. ఎస్, మీరు అనుకుంటున్నదే కరెక్ట్. లేటెస్ట్ మూవీ V డిజిటల్ వేదికపై రిలీజ్ కాబోతోంది. ‘V’ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందని చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఈ చిత్రాన్ని డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో మిస్సయిన వినోదం ఇక నేరుగా మీ ఇంట్లోనే ఉండబోతోందంటూ V మూవీ యూనిట్ చేసిన ప్రకటన ప్రేక్షకులను హుషారెత్తిస్తోంది. నిన్ననే దీనిపై హిట్ ఇచ్చిన హీరో నాని తాజాగా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన ‘V’ మూవీ నేరుగా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందని తెలిపారు. ఈ మేరకు నాని పేర్కొన్న ఆసక్తికర స్టేట్‌మెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ''ఇన్నాళ్లు (దాదాపు 12 ఏళ్ళు) నా కోసం మీరు థియేటర్స్‌కి వచ్చారు.. కానీ ఇప్పుడు మీ కోసం నేనే నేరుగా మీ ఇంటికొస్తున్నా'' అని పేర్కొంటూ తనదైన స్టైల్ కామెంట్ చేశారు నాని. Also Read: ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి కరోనా భయానక పరిస్థితులకు ముందు మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా లాక్‌డౌన్ అమలులోకి రావడం, థియేటర్లు మూతబడటంతో విడుదల ఆగిపోయింది. అయితే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లు వేచి చూడగా నేటికీ సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ V సినిమాలో నాచురల్ స్టార్ నాని, ప్రధాన పాత్రలు పోషించారు. , హైద‌రి హీరోయిన్లుగా నటించారు. 'సైరా నరసింహా రెడ్డి' ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇందులో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ నాని కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g9M3KR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...