Thursday, 20 August 2020

బాహుబలి ఛాలెంజ్‌ని పూర్తి చేసిన భల్లాలదేవ.. మొక్కనాటి ట్యాగ్ చేస్తే రానా రీట్వీట్ చేస్తాడట

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన వన యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కి అపూర్వ స్పందన లభిస్తూ వన విప్లవంగా మారింది. సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి ఈ వన ఉద్యమంలో భాగం అవుతున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు ఈ మంచి కార్యక్రమానికి మరికొంత మంది స్టార్లను నామినేట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ .. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం అవుతూ.. , రామ్ చరణ్, శ్రద్ధాకపూర్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. అయితే బాహుబలి ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ భల్లాలదేవుడు రానా గురువారం నాడు రామానాయుడు స్టుడియోలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, మా దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు.. ఈ సంకల్పానికి నావంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేసినా రీట్వీట్ చేస్తానంటూ తెలియజేశారు’ రానా. మరి ఇంకెందుకు ఆలస్యం.. మొక్కనాటండి.. రానాని ట్యాగ్ చేయండి.. ఇక మీ ట్వీట్ వైరల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kYZWPL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...