Wednesday, 19 August 2020

చిరంజీవి తీసిన మొదటి ఫొటో: వీళ్లలో స్టార్ హీరో ఉన్నాడు.. గుర్తుపట్టారా?

నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ ఒక వింటేజ్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోను ఆయనే స్వయంగా తీశారు. అంతేకాదు, ఇది ఆయన తీసిన మొదటి ఫొటో. ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీశారాయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరంజీవి తీసిన ఈ మొదటి ఫొటొలో ఐదుగురు చిన్న కుర్రాళ్లు ఉన్నారు. అయితే, ‘‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని చిరంజీవి ఛాలెంజ్ విసిరారు. Also Read: చిరంజీవి ప్రశ్నకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆ బాగా తెలిసిన వ్యక్తిని అందరూ గుర్తుపడుతున్నారు. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సరిగ్గా మధ్యలో నిలబడి కుర్రాడు. పవన్ కళ్యాణ్‌ చిన్నతనంలోనూ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా ఈ ఫొటోను చిరంజీవి మొగల్తూరులో తీసి ఉండొచ్చు. అది కూడా ఇంటి మేడ మీద. ఎందుకంటే, ఫొటోలో వెనుక పెంకుల ఇళ్లులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వరల్డ్ ఫొటోగ్రఫీ డే రోజున తాను తీసిన తొలి ఫొటోను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో కూడా చూపించారు చిరు. అయితే, ఈ ఫొటోను ఎలాంటి కెమెరాతో తీశారో కూడా చిరంజీవి చూపించారు. ‘అగ్ఫా3’ కెమెరా ఫొటోను కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iVmZck
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...