Wednesday, 19 August 2020

రైతు కూలీగా రకుల్ ప్రీత్ సింగ్.. వైష్ణవ్ తేజ్ కోసం డీ-గ్లామర్ రోల్!!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయిన రకుల్.. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆమె చూపు బాలీవుడ్ వైపు మళ్లడమే. హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన రకుల్.. బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. అలా అని తెలుగు సినిమా అవకాశాలను వదులుకోవడం లేదు. ఇప్పటికే నితిన్ సినిమాలో నటిస్తోన్న రకుల్.. ఇప్పుడు మరో తెలుగు సినిమాను అంగీకరించినట్టు సమాచారం. ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోన్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా తీసుకున్నారట క్రిష్. కచ్చితంగా ఈ పాత్రకు రకుల్ అయితేనే బాగుంటారని భావించి ఆమెకు స్టోరీలైన్ కూడా చెప్పారట. క్రిష్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో ఆమె వెంటనే అంగీకరించేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. Also Read: అయితే, ఈ సినిమాలో రకుల్ ప్రీత్ డీ-గ్లామర్ రోల్ చేయనున్నారని టాక్. రకుల్ రోజువారీ రైతు కూలీగా కాస్త మొరటుగా కనిపిస్తారని అంటున్నారు. ఇలాంటి పాత్రను రకుల్ పోషించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సంప్రదాయబద్ధంగా, స్టైలిష్‌గా, మోడరన్ లుక్‌లో కనిపించిన రకుల్.. ఇప్పుడు డీ-గ్లామర్ రోల్‌లో ఎలా ఉంటారో చూడాలి. కాగా, ఈ సినిమా థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోందని టాక్. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని క్రిష్ చూస్తున్నారట. ఎందుకంటే, ఇది పూర్తిచేసిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాపై దృష్టి సారించాల్సి ఉంది. అందుకే, మరో రెండు నెలల్లో వైష్ణవ్ తేజ్ సినిమాను క్రిష్ పూర్తిచేసేస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yd6kcg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...