Thursday, 27 August 2020

ఇక బాలీవుడ్ స్టార్ హీరోలంతా అడ్డంగా బుక్కయినట్లే.. ప్రధానికి లింక్ చేస్తూ కంగనా షాకింగ్ కామెంట్స్

యువ నటుడు తర్వాత బాలీవుడ్ మాఫియాపై పెద్దఎత్తున చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో కొందరు బడా హీరోలు, దర్శకనిర్మాతలు ముఠాలుగా ఏర్పడి బ్యాగ్రౌండ్ లేని నటీనటులను అణగదొక్కేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న నేపోటిజం కారణంగా ఎందరో యువనటుల భవిష్యత్ గంగలో కలిసిపోతోందరూ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వాదన బలంగా వినిపిస్తున్న వారిలో ఒకరైన .. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. సుశాంత్ మరణం తర్వాత నిర్మాత కరణ్ జోహార్‌, మహేష్ భట్, ఆదిత్య చోప్రాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా.. రీసెంట్‌గా స్టార్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై కూడా అనుమానం వ్యక్తి చేసిన ఆమె, తాజాగా రియాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకు రావడంతో మరోసారి తన నోటికి పని చెప్పింది. ఏకంగా బాలీవుడ్ బడా హీరోలు, దర్శకులపై ఆటం బాంబు పేల్చేసింది. Also Read: సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రమాదకర డ్రగ్స్ డీలర్స్‌తో చేసిన వాట్సాప్ చాట్ రీవెల్ కావడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ దర్యాప్తు స్టార్ట్ అయితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయటకొస్తాయని, అసలు బండారం బయటపడుతుందని పేర్కొంటూ షాకింగ్ ట్వీట్ చేసింది కంగనా. దీంతో చాలామంది హీరోహీరోయిన్స్ జైలు పాలు కావడం ఖాయమని ఆమె తెలిపింది. ఈ మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ వలె బాలీవుడ్‌లో ఉన్న మురికి కంపును, బెదిరింపు రాజకీయాలను తుడిచిపెట్టాలని కోరుతూ ప్రధానికి తన సందేశాన్ని ట్యాగ్ చేసింది కంగనా రనౌత్. ఆ వెంటనే కూడా బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల పంపిణీ, ఆ మాఫియా ఎంతలా ఉందనే విషయాలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేసింది. దీంతో కంగనా వ్యాఖ్యలు మరోసారి బీ టౌన్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b3aWqA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...