Thursday, 27 August 2020

బాబోయ్! ఇరగదీసిన ప్రగతి.. కత్తిలాంటి స్టెప్పులకు గ్లామర్ డోస్‌ యాడ్ చేస్తూ షేక్ చేసింది.. వీడియో వైరల్

సీనియర్ యాక్టర్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటు వయసులో ఘాటు ట్రీట్ ఇస్తూ యూత్‌కి పిచ్చెక్కిస్తోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రగతి సోషల్ మీడియా వాల్‌పై ఎప్పుడు ఎలాంటి ఆసక్తికర పోస్ట్ కనిపిస్తుందా అని వెతికేవారు ఎక్కువైపోయారు. కాగా తాజాగా ఆమె షేర్ చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అప్పట్లో ‘కజ్ రారే’ అంటూ ఉర్రూతలూగించిన ఐశ్వర్యారాయ్ పాటకు స్టెప్పులేసి యమ అట్రాక్ట్ చేసింది ప్రగతి. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ప్రగతి ఎనర్జీ లెవల్స్ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ‘సూపర్ మేడం.. లవ్ యూ’ అంటూ తెగ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. నేటితరం హీరోయిన్లే ఆశ్చర్యపోయేలా బాడీ ఫిట్‌పై శ్రద్ద తీసుకుంటున్న ఆమె తన వర్కవుట్స్ రెగ్యులర్‌గా హాట్ హాట్ ట్రీట్ ఇవ్వడం హాబీగా మార్చుకుంది. Also Read: వెండితెరపై తల్లిగా, అక్కగా, వదినగా అలరిస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ప్రగతి.. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి రచ్చ చేస్తోంది. దీంతో ఈమెకు సంబంధించిన అన్ని వర్కవుట్ వీడియోలకు సోషల్ మీడియాలో యమ గిరాకీ నెలకొంది. అందుకు తగ్గట్లుగా ఆమె కూడా రెచ్చిపోతుండటంతో నెటిజన్లకు కావాల్సినంత ట్రీట్ లభిస్తోంది. లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా, క్లాసికల్ డాన్స్ వేయాలన్నా అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తోంది ప్రగతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gzYOif
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...