Thursday, 27 August 2020

Anushka Sharma: తల్లి కాబోతున్న అనుష్క శర్మ.. ఫొటోతో పాటు అసలు మ్యాటర్ చెప్పేసిన స్టార్ హీరోయిన్

టీమిండియా కెప్టెన్ , బాలీవుడ్ భామ సినీ, క్రీడాభిమానులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లుగా తాను ప్రెగ్నెంట్ అని వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ అసలు మ్యాటర్ మ్యాటర్ చెప్పేసింది అనుష్క. 2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం అని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు భర్త విరాట్‌తో కలిసి దిగిన లేటెస్ట్ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో అనుష్క శర్మ గర్భంతో కనిపిస్తుండగా విరాట్ ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు ఇదే ఫొటో, ఇదే సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు విరాట్. దీంతో ఈ శుభవార్త విని సినీ, క్రీడాభిమానులు విరాట్, అనుష్కలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుల్లి విరాట్ వస్తాడా? లేక జూనియర్ అనుష్క శర్మ రాబోతోందా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: 2017 డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. పెళ్లి తర్వాత కూడా వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న ఈ జోడీ లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే గడుపుతున్నారు. అలా భర్త విరాట్ కోహ్లీతో కలిసి సరదాగా సమయం గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా ఈ శుభవార్త చెప్పి తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపేసింది. చివరగా జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క.. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31uHCGq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...