Tuesday, 18 August 2020

బాలు అన్నయ్యా.. నిన్ను చీమైనా కుట్టదు: గుండెల్ని పిండేసే ‘సిరివెన్నెల’ కవిత

దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ‘యూనివర్సల్ మాస్ ప్రేయర్‌’లో పాల్గొనాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు సంగీతంతో ముడిపడి ఉన్న గాయనీగాయకులు, సంగీత దర్శకులు, గేయ రచయితలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులు ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. అయితే, ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్న ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆకాంక్షిస్తూ ఒక కవిత వినిపించారు. ఆయనే స్వయంగా కవితను చదువుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరి గుండెను పిండేసే కవిత. బాలుపై సీతారాముడి ప్రేమను, అభిమానాన్ని చాటే కవిత. ‘‘నిన్ను చీమైనా కుట్టదు.. ఆ శివుడి మీద ఆన’’ అని బాలు అన్నయ్యకు తమ్ముడు సీతారాముడు రాసిన భావోద్వేగ కవిత ఇది. Also Read: ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. వెంటిలేటర్‌ను కూడా తొలగించారని, ఆయన ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని బాలు సోదరి ఎస్పీ శైలజ ఈరోజు వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. త్వరలోనే బాలు పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తారని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/322TBdl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...