Tuesday, 18 August 2020

సమంత మెచ్చిన ‘బుచ్చినాయుడు కండ్రిగ’ ట్రైలర్.. సావుతో మొదలైన కథ!

మున్నా, దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుచ్చినాయుడు కండ్రిగ - తూర్పు వీధి...’. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పమిడిముక్కల చంద్రకుమారి నిర్మించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రవి వర్మ, ‘కంచరపాలెం’ రాజు, ప్రభావతి, పవిత్ర ముఖ్య పాత్రలు పోషించారు. 1994 నుంచి 2004 మధ్య జరిగిన కథగా సినిమాలో చూపించారు. పరువు నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. అలాగే, ఎమోషన్స్‌కు కూడా పెద్ద పీట వేశారు. ఈ చిత్రం అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ఈనెల 21న విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం హీరోయిన్ అక్కినేని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని ఆమె కొనియాడారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమంత చెప్పినట్టే ఈ ట్రైలర్ బాగుంది. ‘‘ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది. కానీ, నా కథ నా సావుతో మొదలైంది’’ అనే పవర్ ఫుల్ డైలాగుతో ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు. ఈ ట్రైలర్‌లో అందమైన ప్రేమకథ చూపించారు, తనను కాదన్న అమ్మాయిపై అబ్బాయి ద్వేషాన్ని చూపించారు, ఆ అమ్మాయి కోసం పిచ్చోడై మద్యానికి బానిసైన కుర్రాడిని చూపించారు. ఇన్ని కోణాల మధ్య పరువు అనే కాన్సెప్ట్‌ను చొప్పించారు. మొత్తం మీద ట్రైలర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ట్రైలర్ చూస్తుంటే కొన్ని పాత సినిమాలు గుర్తొస్తున్నా.. ఇందులో కొత్తగా ఏదో చూపించబోతున్నారనే అనుమానం కూడా కలుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/321yGYh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...