Saturday, 8 August 2020

మహేష్ బాబు బర్త్ డే మేనియా.. ట్రెండింగ్‌లో ఉన్న సూపర్ స్టార్.. ప్రపంచంలోనే టాప్ ప్లేస్

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ వచ్చేస్తోంది. ఆగస్టు 9 అనగా రేపు మహేష్ బాబు తన 45వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ట్వీట్స్‌తో సోషల్ మీడియా హాండిల్స్‌ని హోరెత్తిస్తున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని మహేష్ బాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో డిజిటల్ మాద్యమాలైన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల్లో పెద్దఎత్తున హంగామా చేస్తున్నారు సూపర్ స్టార్ ఫాన్స్. దీంతో #HBDMaheshBabu ట్యాగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. 4 మిలియన్లకు పైగా ఈ ట్యాగ్ ఉపయోగించి ట్వీట్స్ చేశారు నెటిజన్లు. అదేవిధంగా ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట హాష్ ట్యాగ్ సెకండ్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ హాష్ ట్యాగ్ ద్వారా 3.75 మిలియన్లకు పైగా ట్వీట్స్ చేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే మహేష్ బర్త్ డే ట్వీట్స్ 10 మిలియన్లు దాటిపోయాయి. దీంతో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 10 మిలియన్ బర్త్ డే ట్వీట్స్ అందుకున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు మహేష్ బాబు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మహేష్ మేనియానే కనిపిస్తోంది. ఆయన సినిమాలు, మహేష్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తు చేస్తూ పెద్దఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మరోవైపు ఆయన మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' నుంచి రానున్న సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Py29Dp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...