దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పెళ్లిపీటలెక్కారు. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేస్తూ ఇష్టసఖి మిహీకను వివాహమాడారు. ఎప్పుడైతే ఈ భల్లాలదేవుడు తన ప్రేయసిని పరిచయం చేశారో అప్పటినుంచే రానా పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూశారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఆ శుభ గడియ వచ్చేయడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ ద్వారా రానా దంపతులకు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ ట్వీట్ చేస్తూ రానా- మిహీకలకు సూపర్ సందేశమిచ్చారు. నవదంపతులు రానా- మిహీక లేటెస్ట్ పిక్ షేర్ చేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈ మేరకు మీ లైఫ్ సుఖ సంతోషాలతో హ్యాపీగా సాగిపోవాలని కోరుకున్నారు మహేష్. దీంతో ఈ ట్వీట్ చూసిన మహేష్ అభిమాన వర్గం పెద్ద ఎత్తున దగ్గుబాటి రానాకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. Also Read: కరోనా విజృంభణ కారణంగా రానా- మిహీక పెళ్లికి 30 మంది అతిథుల్నిమాత్రమే ఆహ్వానించారు. హైదరాబాద్ రామానాయుడు స్టుడియో వీరి వివాహానికి వేదికైంది. వేద మంత్రాల సాక్షిగా మిహికా మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు రానా. సినీ ఇండస్ట్రీ నుంచి నాగ చైతన్య, అల్లు అర్జున్, సమంత ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31E2JoS
v
No comments:
Post a Comment