టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి.. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేశారు. మ్యారేజ్‌తో కొత్త జర్నీ మొదలుపెట్టారు. తన నెచ్చెలి మిహికను వివాహమాడాడు రానా. వేద మంత్రాల సాక్షిగా మిహికా మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు రానా. శనివారం నాడు హైదరాబాద్ రామానాయుడు స్టుడియో వీరి వివాహానికి వేదికైంది. శనివారం రాత్రి 8.30 నిమిషాలకు వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరి వివాహవేడుకకు హాజరయ్యారు. తెలుగు-మార్వారీ సాంప్రదాయాల్లో వీరి వివాహాన్ని జరిపించారు. ఈ వివాహ వేడుక పనుల్ని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్వహించింది. పెళ్లికి వచ్చిన అతిథులకు తెలుగు వంటకాలతో పాటు.. రాజస్థాన్ వంటకాలతో విందు అందించారు. హైదరాబాద్‌లో తాజ్ ఫలక్‌నుమా హోటల్ నుంచి ఈ వంటకాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రానా బాబాయ్ వెంకటేష్ సైతం పెళ్లిలో సందడి చేశారు. ప్రస్తుతం రానా-మిహీకా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా అనుమతించకుండా.. బయో సెక్యూర్ పద్ధతిలో పెళ్లివేడుకను నిర్వహించారు. వివాహ వేడుకలో పాల్గొనే స్టాఫ్‌కి ముందే కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించడమే కాకుండా.. పెళ్లి వేదికతో పాటు పరిసరాలను మొత్తం శానిటైజ్ చేశారు. పెళ్లిలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XJlcPD
v
No comments:
Post a Comment