Tuesday, 4 August 2020

విశ్వాసం లేని కుక్క.. వీడియో వదిలిన నాగబాబు

‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ యూట్యూబ్‌లో యాక్టివ్ ఉంటే .. ఈసారి తన ఇంట్లో జరిగిన ఆసక్తికర సన్నివేశాన్ని వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ వీడియోకి ‘విశ్వాసం లేని కుక్క’ అని టైటిల్ పెట్టడంతో ఈసారి మెగా బ్రదర్ నాగబాబు.. ఎవర్నో గట్టిగానే క్లాస్ పీకుతున్నారని అనుకున్నారంతా.. అయితే రొటీన్‌కి భిన్నంగా ఫన్నీ వీడియోను షేర్ చేశారు నాగబాబు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. జంతువులన్నింటిలోనూ మనుషులతో బాగా అనుబంధంగా ఉండేవి కుక్కలు.. నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే ఇష్టం. మా ఇంట్లో పీకూ అనే సూపర్ బ్రీడ్ కుక్క ఒకటి ఉంది. 2016 నుంచి మా ఇంట్లోనే మాతోనే ఉంటుంది. మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినా.. నా మీదికి ఎవరైనా వచ్చినా.. సరదాగా కొట్టినట్టుగా చేసినా.. వాళ్లపై భయంకరంగా ఎటాక్ చేస్తుంది.. ఇన్నాళ్లు అలాంటి కలరింగ్ ఇచ్చింది. మనం ఎన్నో కుక్కల గురించి విని ఉంటాము.. యజమానిని కాపాడిన కుక్క.. యజమానిని కాపాడటంలో ప్రాణాలు కోల్పోయిన కుక్క.. ఇలా ఎన్నో విని ఉంటాము. ఇలా కుక్కల గురించి ఎన్నో సాహసగాధలు వినే ఉంటాము. మా పీకూ (కుక్క) కూడా అలాంటి కోవకు చెందినదే అని ఇన్నాళ్లు అనుకున్నా. మొన్న ఆవిడకు పాములంటే భయం అనడంతో.. ఆ భయం పోగొట్టడానికి రబ్బరు పాములు తీసుకువచ్చి.. తనతో పట్టించా. (ఆ పాముని చూడగానే నాగబాబు భార్య పద్మతో పాటు ఆ కుక్క కూడా లోపలికి పారిపోయింది.. వాళ్లని చూసి నాగబాబు చాలా నవ్వుకున్నారు) ఆ సన్నివేశం చూడగానే నాకు ఏం అనిపించింది అంటే.. మా పీకూ నా గురించి ఆలోచించలేదు.. వాడి ప్రాణాలు కాపాడాలేమో.. ఆ పాము ఏమైనా చేస్తుందేమో అనుకోలేదు.. వీడు పోతే పోయాడు.. ఉంటే ఉన్నాడు.. నా జీవితం నాకు ముఖ్యం.. నా ప్రాణం నాకు ముఖ్యం అనుకుని ఒక్క రన్ కొట్టింది అక్కడ నుంచి.. అది పారిపోగానే మా పీకూకి కూడా మనిషి లక్షణాలు బాగా వచ్చాయి (నవ్వుతూ). మీరు కూడా ఈ వీడియోను చూసి నవ్వు కోండి అంటూ ‘విశ్వాసం లేని కుక్క’ పేరుతో ఫన్నీ వీడియోను విడుదల చేశారు నాగబాబు. అయితే ఇదే కుక్కపై గతంలో నాగబాబు ‘ఒక కుక్క మనిషిని ఇంత ప్రేమిస్తుందా?’ అని వీడియో వదిలారు కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39YHeTs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...