Tuesday, 4 August 2020

శర్వానంద్‌తో సినిమాను ప్రకటించిన ప్రముఖ నిర్మాణ సంస్థ

ఏషియన్ గ్రూప్ యూనిట్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి వరుసపెట్టి సినిమాలను ప్రకటిస్తోంది. నిఖిల్ 20వ సినిమాని నిర్మించ‌నున్నట్లు ఇటీవల ప్రకటించిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంస్థ.. తాజాగా యంగ్ హీరో శ‌ర్వానంద్‌తో ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతలు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు మంగళవారం మీడియాకు తెలిపారు. త్వర‌లో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్‌, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్రక‌టించ‌నున్నారు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ప్లాన్ చేస్తోంది. శ‌ర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీ‌కారం’ చిత్రంతో పాటు ఒక తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు. మ‌రోవైపు నాగ‌చైత‌న్య, సాయిప‌ల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో ‘ల‌వ్ స్టోరి’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. Also Read: ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో శర్వానంద్ సరైన విజయం అందుకోలేకపోయారు. ‘శతమానం భవతి’ సినిమా తరవాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘రాధ’ డిజాస్టర్ తరవాత ‘మహానుభావుడు’ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా ‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ సినిమాలు నిరాశపరిచాయి. సమంత, శర్వానంద్ జంటగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ‘జాను’పై అంచనాలు ఏర్పడినా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. మరి రాబోయే చిత్రాలతో శర్వా ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39WU3xf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...