మెగా బ్రదర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా మతం, అంటూ సంచలన కామెంట్స్ చేశారు. గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న ఆయన.. తాజాగా హిందూ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నేనొక నాస్తికుడిని అంటూ మొదలుపెట్టి హిందుత్వం గురించి మాట్లాడి పలు చర్చలకు తెరలేపారు. నాగబాబు పెట్టిన ట్వీట్స్ ఉన్నది ఉన్నట్లుగా చూస్తే.. ''నేనొక నాస్తికుడిని. కానీ కొన్ని మత సిద్ధాంతాల పట్ల నా ఒపీనియన్ చెప్పాలి. హిదూత్వం అంటే నాకు గౌరవం. కారణం ఏంటంటే ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా, అనేక దేవతలున్నారని నమ్మినా, విగ్రహారాధనని నమ్మినా, ఇతర మతాలని నమ్మినా, అసలు దేవుడే లేడనే నాస్తికులుని ఎవరినీ నిందించని మతం హిందూమతం'' అని ఫస్ట్ ట్వీట్ చేసిన నాగబాబు దానికి కొనసాగింపుగా మరో సందేశమిచ్చారు. Also Read: ''మనిషిని మనిషిగా మంచిగా బ్రతకమని చెప్తుంది హిందుమతం. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెప్తుంది హైన్దవం. నీ మతం కానీ వాడిని చంపెయ్యి, విగ్రహారాధన చేసే వాళ్ళు నరకానికి పోతారు, మా దేవుడు నిజమైన దేవుడు.. మీ దేవుడు చెడ్డవాడు అంటూ పిచ్చి మాటలు చెప్పని హిందుత్వం అంటే నాకు గౌరవం కానీ నేను మాత్రం నాస్తికుడను'' అని పేర్కొన్నారు నాగబాబు. గతంలో కూడా ఇలాగే ''సో గాడ్ అనే కాన్సెప్ట్‌కి మీనింగే లేదు. కాబట్టి గాడ్ ఇన్వాల్మెంట్ లేకుండా మన జీవితాల్ని మనం ఇష్టం ఉన్నట్లుగా జీవించాలి. చాలా రోజుల క్రితమే దేవుడు చచ్చిపోయాడు'' అని నాగబాబు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OVa9xV
v
No comments:
Post a Comment