Saturday, 25 July 2020

తమ్ముళ్లు చిరు, పవన్‌లకు ధన్యవాదాలు: కైకాల సత్యనారాయణ

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ. నేడు (జూలై 25) ఆయన పుట్టిన‌రోజు నేడు. న‌టుడుగా గ‌త ఏడాది ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భ‌క్త ప్ర‌హ్లాద` విడుద‌ల అయితే.. 1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. 1959లో ఆయ‌న న‌టించిన `సిపాయి కూతురు` విడుద‌లైంది. ఇప్ప‌టికి న‌టుడిగా 61 సంవ‌త్స‌రాలు కాగా.. వ్య‌క్తిగ‌తంగా ఈ ఏడాది జులై 25కి 85 సంవ‌త్స‌రాలు పూర్త‌ి చేసుకుని 86 ఏట అడుగుపెట్టారు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేరు పేరునా వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ్ముళ్లు , ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారని కైకాల‌ వెల్ల‌డించారు. వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న బందుమిత్రులు, కుటుంబ స‌భ్యులు స‌హా అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.వారితో పాటు చిత్ర పరిశ్రమకు నుంచి తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అలాగే.. మీడియా వారితో పాటుగా నన్ను అభిమానించే అభిమానులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OWrTc9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...