Saturday, 25 July 2020

హీరో విశాల్, ఆయన తండ్రికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. పేదల నుంచి వీఐపీలు, బడా స్టార్ల వరకు అందరినీ అటాక్ చేస్తోంది. ఇండియన్ సినిమా బిగ్ బీ అమితాబచ్చన్ ఫ్యామిలీతో పాటు ఎందరో సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడ్డారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు టెలివిజన్ సెలబ్రిటీలను వణికిస్తుంటే.. కోలీవుడ్‌లో అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా, తమిళంతో పాటు తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ అని తేలిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ తరుణంలో అన్ని డౌట్స్‌కి క్లారిటీ ఇస్తూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. ‘‘అవును! అది నిజం. కరోనా పరీక్షల్లో మా నాన్న (జీకే రెడ్డి)కు పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డాను. నా మేనేజర్‌కు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. మేమంతా ఆయుర్వేద ఔషధాలు వాడి కేవలం వారం రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా’’ అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం విశాల్‌ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిటెక్టివ్‌ 2’తో పాటు ‘చక్ర’ అనే సినిమాలోనూ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రాల షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39qHRVk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...