సంస్కృత సినిమా ‘నమో’ ట్రైలర్‌ను విడుదల చేశారు టాలీవుడ్ . ప్రముఖ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ట్విట్టర్ వేదికగా నమో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు చిరు. 'జయరామ్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి అబ్బుర పడ్డాను. బ్రదర్.. జయరామ్ పెట్టిన ఎఫర్ట్‌కి ప్రేక్షకాధరణతో పాటు అవార్డులు కూడా రావాలి. సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు' అని కామెంట్ కూడా పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. త్వరలో అన్ని భాషల్లో రేలీజ్ కానున్న ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు. అనస్వర చారిటబుల్ ట్రస్ట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో జయరామ్ కుచేలుడి పాత్రలో కనిపిస్తారు. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడి జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. సినిమా మొత్తం సంస్కృత భాషలోనే తెరకెక్కుతోంది. విలక్షణ నటుడు ‘జయరామ్’ కుచేలుడి పాత్రలో భారతీయ ప్రేక్షకుల్ని భక్తిపారవశ్యంలో ముంచబోతున్నాడు. ‘భాగమతి’లోనూ, ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ లోనూ తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని జయరామ్ అలరించిన సంగతి తెలిసిందే.. Read More: ‘నమో’సినిమా కోసం జయరామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పాత్రను ఓన్ చేసుకొని మరీ మేకోవర్ అవుతున్నాడు. పూర్తి గా గుండుకొట్టించుకొని .. దాదాపు 20కేజీల వరకూ బరువు కూడా తగ్గారు. ఇటీవల నమో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. 101 నిమిషాల ప్రదర్శనా సమయం కలిగిన ఈ చిత్రం త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZXD8HI
v
No comments:
Post a Comment