Sunday, 26 July 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమం.. భాగమైన చిరంజీవి, రామ్ చరణ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో భాగం పంచుకుంటున్నారు. ఈ మేరకు భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమమాన్ని ప్రారంభించడం జరిగింది. Also Read: ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు మెగాస్టార్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ‘హరితహారం’లో భాగంగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి.. భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి వివరించారు మెగాస్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WVusjh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...