Sunday, 26 July 2020

Priyamani: సమంత చాలా డిఫరెంట్.. అక్కినేని కోడలి క్యారెక్టర్‌‌పై ప్రియమణి కామెంట్

పెళ్లి తర్వాత కాసింత సినిమాల జోష్ తగ్గించిన బ్యూటిఫుల్ హీరోయిన్ .. ఇప్పుడు వరుస సినిమాలను అంగీకరిస్తూ వెండితెరపై సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలుగులో రానాతో 'విరాటపర్వం', విక్టరీ వెంకటేష్ సరసన 'నారప్ప' సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండింటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది ప్రియమణి. అయితే ఇదే వెబ్ సిరీస్‌లో తనతో పాటు నటిస్తున్న అక్కినేని క్యారెక్టర్ గురించి స్పందిస్తూ ఆమె రోల్ ఎలా ఉంటుందనేది తెలిపింది ప్రియమణి. ప్రస్తుతం అక్కినేని సమంత, ప్రియమణి కలిసి '' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ సీజన్ 2లో సమంత రోల్ పూర్తి ట్విస్టులతో నెగెటెవ్ షేడ్‌లో రక్తి కట్టిస్తుందని ఇప్పటికే బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే వాటిని నిజం చేసేలా ప్రియమణి కొన్ని కామెంట్స్ చేసింది. తనకు తెలిసినంత వరకు సమంత ఈ వెబ్ సిరీస్‌లో చాలా విభిన్నంగా కనిపించబోతోందని చెప్పింది ప్రియమణి. కాకపోతే ఈ మూవీలో తామిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పుకొచ్చింది. Also Read: ఫ్యామిలీ‌మేన్ 1లో ప్రియమణి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ‌మేన్ 2 లో మాత్రం తన పాత్ర మరింత ప్రత్యేకంగా ఉంటుందని అంటోంది ప్రియమణి. టాలెంటెడ్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలు ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో ఈ ఫ్యామిలీ‌మేన్ 2 రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32UDCA5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...