Tuesday, 28 July 2020

సిక్స్ పాక్ అంటే భార్యతో సమానం.. చీట్ చేయాలని చూశారో! నాగశౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యంగ్ హీరో నాగశౌర్య గురించి ఆసక్తికరంగా స్పందించారు. తన లేటెస్ట్ మూవీ కోసం భారీగా కండలు పెంచారు నాగశౌర్య. ''ఛలో, ఓ బేబీ, అశ్వ‌థ్థామ'' లాంటి సూప‌ర్‌ హిట్ సినిమాల తర్వాత తన కెరీర్‌లో 20వ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారట ఈ యంగ్ హీరో. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో చేతిలో బాణం పట్టుకొని గమ్యంపైనే దృష్టి పెట్టి కనిపించారు నాగశౌర్య. దీంతో గురి తప్పదని, ఈ ఒక్క లుక్ తోనే సినిమా సూపర్ డూపర్ ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తన ఫస్ట్‌లుక్‌పై వస్తున్న రెస్పాన్స్ చూసి తాజాగా స్పందించిన నాగశౌర్య.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''సిక్స్‌ప్యాక్ అంటే భార్యతో సమానం, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ చీట్ చేయాలని చూశారో.. దూరమైపోతుంది'' అని పేర్కొంటూ ఆ లుక్ కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు. ఈ సిక్స్ పాక్ కోసం ఎంతో కష్టపడ్డానని, నాలుగు నెలల పాటు అసలు రైస్ జోలికే వెళ్లలేదని నాగశౌర్య తెలిపారు. కాగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో నాగశౌర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోందని టాక్. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. అతిత్వరలో మూవీ టైటిల్, విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/318Wrxh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...