వెటరన్ డాన్సర్ (101) కోల్‌కతాలో కన్నుమూశారు. వయసు పైబడటంతో అనారోగ్యం కారణంగా ఆమె మరణించారు. అమల శంకర్ మనవరాలు శ్రీనంద శంకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1919 జూన్ 27న బంగ్లాదేశ్‌లో జన్మించిన అమల శంకర్.. ప్రముఖ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్‌ను తన 11 సంవత్సరాల వయస్సులో పెళ్లాడారు. ఇంట్నరేషనల్ కలోనియల్ ఎగ్జిబిషన్ ఉదయ్‌ను కలిసి.. ఆయన డాన్స్‌లు నచ్చి ఆకర్షితురాలైన అమల అతనికి దగ్గరై ఇంట్లో వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఉదయ్ శంకర్ ఆమె కంటే వయసులో 19 ఏళ్ళు పెద్దవాడు కావడం విశేషం. తన భర్త ఉదయ్‌తో కలిసి కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో డాన్స్ షోలు ఇచ్చి ఫేమస్ అయింది అమల శంకర్. భర్త ఉదయ్ రాసి, దర్శకత్వం వహించిన 'కల్పన' అనే మూవీలో ఆమె నటించింది. కాగా అమల మరణ వార్తను తెలుపుతూ ఆమె మనవరాలు శ్రీనంద శంకర్ ఆవేదన చెందింది. ''గత నెలలోనే అందరం కలిసి మీ బర్త్ డే జరిపాం. నేడు ఆమె కోల్‌కతాలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం కోల్‌కతా వెళ్ళడానికి ముంబై నుంచి విమానాలు లేవు. చాలా బాధగా ఉంది. లవ్ యూ తమ్మా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని ఆమె పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39nKKX2
v
No comments:
Post a Comment