Friday, 24 July 2020

Rgv: రామ్ గోపాల్ వర్మ 'మర్డర్'.. మరీ ఈ రేంజ్ లోనా? భలే ప్లాన్ చేశారే..! షాకింగ్ అప్‌డేట్

వివాదాస్పద దర్శకుడు దూకుడుగా వెళ్తున్నారు. వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ తన సినిమాలను అనుక్షణం వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. ప్రతి అప్‌డేట్‌ని ఆసక్తికరంగా మలుస్తూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రత్యేకంగా ప్రమోషన్స్ అవసరం లేకుండా ఇదే ఆయనకు పెద్ద పబ్లిసిటీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ మూవీ '' తాలూకు ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు ఆర్జీవీ. అమృత, మారుతీ రావుల విషాద గాదపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై 'మర్డర్' పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి ఆసక్తి రేకెత్తించిన ఆర్జీవీ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. Also Read: ''ఓ తండ్రి తన కుమార్తెను అమితమైన ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది'' అని తెలుపుతూ మర్డర్ సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ తాలూకు అప్‌డేట్ ఇచ్చి షాకిచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో జులై 28వ తేదీ ఉదయం 9 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలా ఈ మూవీ 5 భాషల్లో రిలీజ్ కానుందని చెప్పకనే చెప్పేశారు వర్మ. కాగా మర్డర్ సినిమాపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అమృత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. 'మర్డర్' ఫస్ట్‌లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగిందని, ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని పేర్కొంటూ ఆవేదన చెందింది అమృత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3huH4Wk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...