Friday, 24 July 2020

పోర్న్ కోసమే ఈ డిజిటల్ స్పేస్‌లో!! మీరంతా కన్ఫ్యూజ్ కావొద్దనే ఈ వీడియో.. వర్మ లేటెస్ట్ సెన్సేషన్

ఎలాంటి వివాదం లేదంటూనే తనదైన శైలిలో మాటలు చెప్పడం లోనూ, సినిమాలు రూపొందించడం లోనూ రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఎంజాయ్ చేస్తుండటం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే నయా ట్రెండ్ క్యాచ్ చేసుకుంటున్న వర్మ.. వరుస సినిమాలు తీస్తూ వాటిని తన సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ world theatreలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా 'ఎన్నికల తర్వాత కథ' అనే ట్యాగ్ లైన్‌తో '' సినిమా చేస్తున్న ఆయన ఈ మూవీకి భారీ హైప్ తీసుకొచ్చేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వరుసపెట్టి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ సినిమాను ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మ.. తాజాగా పవర్ స్టార్ సినిమాను తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఏ విధంగా చూడాలి? ఎలా డబ్బులు చెల్లించాలి? అనే విషయం తెలుపుతూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా సందేశమిస్తూ పోర్న్ వెబ్‌సైట్స్ గురించి మాట్లాడారు. దీంతో 'పవర్ స్టార్' మూవీ మరోసారి ఇలా వార్తల్లో నిలిచింది. Also Read: ఈ వీడియోలో వర్మ మాట్లాడుతూ.. తనకు అస్సలు టెక్నాలజీనే తెలియదని, కేవలం పోర్న్ కోసమే తాను ఈ డిజిటల్ స్పేస్ వచ్చానంటూ విషయాన్ని మెల్లగా తన సినిమా వైపు మళ్లించారు. నిరక్షరాస్యులకు, టెక్నాలజీ మీద అవగాహన లేని వారికి డిజిటల్ స్పేస్‌లో పవర్ స్టార్ సినిమా ఎలా చూడాలో చెబుతూ వివరణ ఇచ్చారు. పవర్ స్టార్ సినిమా చూడాలని కోరిక ఉండి కూడా ఎలా చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న కొంతమంది కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేశానని ఆయన చెప్పారు. కన్ఫ్యూజ్ కాకుండా పవర్ స్టార్ చూసేలా ఇంత వివరణ ఇచ్చాక కూడా అర్థం కాకుంటే.. మీ ఇంటి పక్క వాళ్ళనో, లేక దగ్గరి వాళ్ళనో అడిగి తెలుసుకోండి అని అన్నారు ఆర్జీవీ. సో.. తన సినిమాలు నిరక్షరాస్యులు కూడా మిస్ కావొద్దని వర్మ బలంగా ఫిక్స్ అయ్యారని ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది కదూ!. ఏదేమైనా తన మూవీ ప్రమోషనే ప్రధాన కర్తవ్యంగా వర్మ వెళ్తున్న తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E7yPRw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...