తెలుగులో కొన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన .. ‘నకిలీ’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘డాక్టర్ సలీమ్’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఇవి తమిళ అనువాద చిత్రాలు. ఆ తరవాత ‘బిచ్చగాడు’ చిత్రంతో (తమిళంలో ‘పిచాయికరన్’) బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటొని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. అయితే, ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటొని ఈరోజు (జూలై 24న) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషలలో ‘’ ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదలచేసింది చిత్ర యూనిట్. విజయ్ ఆంటొని అటువైపు నిల్చొని ఉన్న ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. Also Read: మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన విజయ్ ఆంటొని.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని భావించి, నిర్మాతగా మారి అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు విజయ్. ఆ తర్వాత ‘భేతాళుడు’, ‘యముడు’, ‘ఇంద్రసేన’, ‘రోషగాడు’, ‘కిల్లర్’ వంటి వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ‘బిచ్చగాడు 2’తో మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jL9sFI
v
No comments:
Post a Comment