బుధవారం (జూన్ 10) నాడు నందమూరి నటసింహం 60వ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. నందమూరి అభిమానులు ప్రతిఒక్కరూ ఇంట్లోనే కేక్ కట్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. బాలకృష్ణ 60 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుండగా.. నందమూరి అభిమానులకు పెద్ద పండగలా భావిస్తున్న తరుణంలో ఆయన కూతురు, నారా లోకేష్ భార్య ఎమోషనల్ పోస్ట్‌ను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘నాన్నగారి అభిమానులందరికీ నమస్కారం.. నాన్న (బాలకృష్ణ) గారి 60వ జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే నాన్న గారి వ్యక్తిత్వాన్ని తెలియజెప్పే విధంగా ఉన్న ఇంట్రస్టింగ్ పోస్ట్, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. చాలా రెస్పాన్స్‌గా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్నింటికంటే నాకు గర్వంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే.. ఈ సంవత్సరం నాన్న గారి పుట్టినరోజుని అభిమానులంతా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు సేఫ్‌గా ఉండటమే కాదు.. మీ చుట్టూ ఉండేవారంతా సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. అంతే కాకుండా నాన్న గారికి ఎలాంటి క్రమశిక్షణ ఉందో.. అదే క్రమశిక్షణ మీకు కూడా ఉండటం హ్యాపీగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే మా ఫ్యామిలీపై ఉంచాలని కోరుకుంటూ మీ బ్రాహ్మణి నారా’.. అంటూ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకున్నారు ఆమె కూతురు నారా బ్రాహ్మణి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h3vKkw
v
No comments:
Post a Comment