Monday, 8 June 2020

రామ్ చరణ్ చాలా డిఫరెంట్.. పెళ్లి తర్వాత ఇబ్బంది పడ్డా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: ఉపాసన

మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించకపోయినా మెగా కోడలిగా, సమాజ హితం కోరుకునే వ్యక్తిగా మంచి గుర్తింపు సంపాదించి సూపర్ పాపులారిటీ కూడగట్టుకుంది. వారసత్వంగా వస్తున్న అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూనే ఇండిపెండెంట్‌గా నిలదొక్కుకుంటోంది ఉపాసన. ఈ క్రమంలోనే సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేస్తూ మహిళా హక్కులపై ఆమె పోరాడుతోంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పిన ఆమె.. పుట్టినింటి, మెట్టినింటి సంగతులను వివరించింది. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు తనను స్వతంత్రంగా పెంచారని, ఈ సమాజంలో నమ్మకంగా జీవించడం ఎలాగో నేర్పిస్తూ అన్ని విషయాల్లో తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని ఉపాసన తెలిపింది. అదే తనను ఈ రోజున స్వతంత్ర మహిళగా నిలబెట్టిందని తెలిపింది. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉందని, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో అయినా దైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన వద్ద నేర్చుకున్నానని చెప్పింది. ఇతరులను ప్రేమించడం, ఆప్యాయత చూపించడం లాంటి ఎన్నో అంశాలు తన తండ్రి ద్వారానే అలవర్చుకున్నానని ఉపాసన చెప్పుకొచ్చింది. Also Read: అయితే పెళ్లి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పిన ఉపాసన.. మెట్టినింటిలో అడుగుపెట్టాక జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసిందని, అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకున్నానని, కాస్త ఇబ్బంది కూడా పడ్డానని చెప్పింది. తనకు నచ్చిన సెలబ్రిటీని వివాహం చేసుకోవడం అదృష్టమని, ఆన్‌స్క్రీన్ రామ్ చరణ్‌కి ఇంట్లో ఉండే రామ్ చరణ్‌కి చాలా తేడా ఉంటుందని ఆమె చెప్పింది. కాకపోతే ఆ సీక్రెట్ మాత్రం చెప్పానంటూ ఆసక్తికరంగా స్పందించింది ఉపాసన. రామ్ చరణ్, తాను భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటూనే ఒకరి వృత్తిని మరొకరం గౌరవిస్తామని ఆమె తెలిపింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇద్దరికీ కావాల్సినంత సమయం దొరకడంతో ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశామని ఉపాసన చెప్పింది. రామ్ చరణ్ ఫ్యామిలీ సెలబ్రిటీ ఫ్యామిలీ మాత్రమే కాదని ఇది ఓ బిజినెస్ ఫ్యామిలీ కూడా అని ఆమె చెప్పడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YbUDll
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...