Monday, 8 June 2020

Mokshagna cine entry: చిరంజీవినే ఫాలో అవుతున్న బాలకృష్ణ.. కొడుకు విషయంలో సేమ్ టు సేమ్ ఫార్ములా!

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వారసుల హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త జెనెరేషన్ సినీ ఎంట్రీ ఇస్తూ అభిమానులను హుషారెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు, తనయుడు సినీ ఎంట్రీపై అందరి దృష్టి పడింది. నిజానికి చిత్రసీమలో మోక్షజ్ఞ అడుగుపెట్టబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా అవేవీ నిజం కాలేదు. అయితే ఇటీవల తన కొడుకు సినీ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించడంతో మరోసారి అందరి కళ్ళు మోక్షజ్ఞపై పడ్డాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుంది? ఏ డైరెక్టర్ ఆ కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు? అనే దానిపై వెతుకులాట మొదలైంది. అయితే తాజాగా బయటకొచ్చిన సమాచారం ప్రకారం కొడుకు సినీ ఎంట్రీపై చిరంజీవి ఉపయోగించిన ఫార్ములానే బాలయ్య కూడా వాడబోతున్నారని తెలుస్తోంది. వార‌సులను ప‌రిచ‌యం చేయ‌డంలో పేరుగాంచిన పూరి జగన్నాథ్ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ. Also Read : గతంలో కొణిదెల వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ పూరి జగన్నాథ్ చేతుల మీదుగానే జరిగింది. తనను నమ్మి కొడుకు సినిమా అప్పజెప్పిన చిరంజీవికి 'చిరుత' రూపంలో భారీ సక్సెస్ సాధించి చూపించారు పూరి జగన్నాథ్. ఈ క్రమంలోనే బాలయ్య సైతం కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పూరితోనే కావాలని భావిస్తున్నారట. పైగా 'పైసా వ‌సూల్' సినిమా స‌మ‌యంలో పూరీకి బాల‌య్య బాగా క్లోజ్ కావడంతో, ఆయనైతేనే పక్కా అనే నిర్ణయానికి వచ్చారట. సో.. చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h4Prsf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...