ప్రముఖ క్రికెటర్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్‌షిప్’ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది తమిళ సినిమా కావడంతో తన ట్వీట్‌లో తన మెసేజ్‌ను కూడా తమిళంలోనే రాశారు. అయితే, భజ్జీ ట్వీట్‌కు మాస్టర్ బ్లాస్టర్ స్పందించారు. ‘‘ఫ్రెండ్‌షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ’’ అని సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్‌షిప్’ సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది. కాగా, ఇన్నాళ్లూ క్రికెటర్‌గా భారత అభిమానులను అలరించిన హర్భజన్ సింగ్ ఇప్పుడు వెండితెరపై వినోదాన్ని పంచనున్నారు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తమిళ సినిమా ద్వారా ఆయన తెరంగేట్రం చేస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, హిందీలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Also Read: ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YdhlcQ
v
No comments:
Post a Comment