సూపర్ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ''కు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న మహేష్.. ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 'సర్కారు వారి పాట'కు దర్శకత్వం వహించనున్న తాలూకు విషయం బయటకొచ్చింది. గతంలో ''ఆంజనేయులు, సోలో'' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ 'గీతగోవిందం' సినిమాతో తన టాలెంట్ రుజువు చేసుకున్నారు. ఈ మూవీ అందించిన విజయంతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీకి గాను అన్ని షేర్స్ కలుపుకొని 9 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న ఆయనకు మహేష్ బాబు 'సర్కారు వారి పాట' నిర్మాతలు అంతకుమించి ఆఫర్ చేశారని సమాచారం. Also Read: కొన్నినెలల పాటు ఈ 'సర్కారు వారి పాట' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి పలు మార్పులు చేస్తూ.. చివరకు మహేష్ బాబును తన ఫైనల్ అవుట్‌పుట్‌తో మెప్పించారు పరశురామ్. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్మ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గొద్దని మహేష్ సూచించారట. దీంతో పరశురామ్‌కి 10 కోట్ల రెమ్మ్యూనరేషన్ ఫిక్స్ చేశారని ఇన్‌సైడ్ టాక్. దీంతో ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ పారితోషికం కానుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అతిత్వరలో 'సర్కారు వారి పాట' సెట్స్ మీదకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37a74lV
v
No comments:
Post a Comment