ఒకానొక సమయంలో తెలుగు తెరపై ఓ వెలుగు వెలుగుతూ వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటించింది హీరోయిన్ . ఆమె రూపంలో టాలీవుడ్ లోకానికి కొత్త అందం పరిచయమైంది. నటన, డాన్స్, అందాల ఆరోబోత అన్నింటా కొత్తదనం చూపిస్తూ మాంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కాకపోతే సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్న ఈ బ్యూటీ తాజాగా తన పుట్టినరోజు తాలూకు పిక్స్ షేర్ చేసింది. జూన్ 5వ తేదీ 1976 సంవత్సరంలో జన్మించిన రంభ.. మొన్నటి జూన్ 5న తన 44వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. తన భర్త, వ్యాపారవేత్త ఇంద్రన్ కుమార్, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె తన పుట్టినరోజును ఎంజాయ్ చేసింది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం తన కుటుంబ సభ్యులతోనే ఆమె బర్త్ డే వేడుక జరుపుకుందట. ఈ పిక్స్‌ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంలో వైరల్ అవుతున్నాయి. Also Read: తన ముగ్గురు పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న, తన భర్త ఇంద్రన్ కేక్ తినిపిస్తున్న పిక్స్ అభిమానులతో పంచుకుంటూ.. ఆ రోజును తన పిల్లలు, భర్తతో సంతోషంగా గడిపానని తెలిపింది. ఈ సర్‌ప్రైజింగ్ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోసారి వెండితెరపైకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30kR4vV
v
No comments:
Post a Comment