Tuesday, 2 June 2020

రెచ్చిపోయిన మెగా డాటర్.. బ్యాక్‌లెస్ పోజు!! కేక పెట్టిస్తున్న నిహారిక అందాలు

కొణిదెల వారసురాలు, మెగా డాటర్ రూటు మార్చేసింది. ఇన్నాళ్లు పద్ధతైన దుస్తుల్లో కనిపించిన ఈమె ఇప్పుడు తన అందాల తలుపులు తెరిచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆ అందాలను వడ్డిస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్స్, నిహారిక గ్లామర్ ట్రీట్ చూసి వావ్! మెగా డాటర్ ఈ రేంజ్‌లో కూడా కిక్కిస్తుందా అని పరేషాన్ అవుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా తులిప్ మ్యాగజైన్ కోసం చేసిన ఓ ఫోటో షేర్ చేసి స్పెషల్ కిక్కిచ్చింది. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిహారిక గ్లామర్ లుక్‌ని కవర్ పేజీపై ముద్రించారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన మెగా డాటర్.. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌పై తన ఫోటో ప్రింట్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ ఫోటోలో బ్యాక్‌లెస్ పోజిస్తూ కనిపిస్తోంది నిహారిక. మత్తెక్కించే కళ్ళు, ఆమె చూస్తున్న చూపు నెటిజన్ల గుండెల్లో గుచ్చుకుంటోంది. ఆమెను ఇలా చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్ ‘‘సూపర్, గ్లామర్ బ్యూటీ’’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. Also Read: ఇన్నాళ్లు పద్దతిగా కెమెరా ముందు కనిపించిన నిహారిక.. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు రెడీ అని అంటోంది. గ్లామర్ రోల్స్ చేస్తానని, కథ డిమాండ్ చేస్తే అందాల విందుకు వెనుకాడేది లేదని చెబుతోంది. ఇప్పటిదాకా ఆమె హీరోయిన్‌గా చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరోవైపు నిహారిక పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆమె తండ్రి నాగబాబు ఇటీవలే ప్రకటించారు. సో.. చూడాలి మరి రానున్న రోజుల్లో మెగా డాటర్ గ్లామర్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉండనుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Rlt6i
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...