Tuesday, 2 June 2020

చిరు-బాలయ్య ఇష్యూపై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. ఆయనకు ఈగో ఎందుకు?

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన వర్సెస్ ఇష్యూపై స్పందించారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు బాలయ్య బాబుగారు తెలుసు.. అలాగే అన్నయ్య చిరంజీవి గారు కూడా తెలుసు. ఈ వివాదం విషయానికి వస్తే.. అన్నయ్య చిరంజీవి పెద్దగా ఉన్నారు.. ఓ నలుగురు కలిసి వెళ్లి ఆయనతో కూర్చుని మాట్లాడారు. అందులో పెద్ద విషయం ఉందని నేను అనుకోను. దానికి నన్ను పిలవలేదు.. మిమ్మల్ని పిలవలేదని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆయనకు (చిరంజీవి) పెద్దరికం ఉంది.. ఇండస్ట్రీకి పెద్దన్నయ్య.. వాళ్లు మాట్లాడటం అయిన తరువాత పిలవాలనుకుంటే పిలుస్తారు. ప్రతి మీటింగ్‌కి అందరూ వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని నేను అనుకుంటా. బాలయ్య బాబు గారికి పెద్ద మాట చెప్పడం కాదు కాని.. నాకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే చిరంజీవి అంటే ఆయనకు ఒక పెద్దరికం ఉంది. ఓ నలుగురు కూర్చుని ఇష్యూ కోసం మాట్లాడి సమస్యకు పరిష్కారం ఆలోచించారు. తరువాత పిలుస్తారని అనుకోవచ్చు కదా.. ఈగోలు తప్పు.. ఇలాంటి ఈగోలను మీడియా కూడా పెద్దది చేయకూడదు. ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టడం అనవసరం’ అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ వాదనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఎవరికి పెద్ద.. ఎవరికి పెద్దన్నయ్య అని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే.. మీరు అనుకున్నట్టే పెద్దన్నయ్యే అనుకుందా.. పెద్ద అంటే నలుగుర్ని కలుపుకుని పోవాలకి కాని.. ఉన్న నలుగుర్ని రెండు గ్రూప్‌లుగా చేసేవారు అందరి వాడు ఎలా అవుతాడు.. కొందరి వాడే అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. ప్రకాష్ రాజ్ కరెక్ట్‌గా చెప్పారని మెగా ఫ్యాన్స్ మద్దతు ప్రకటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U02uBg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...