Tuesday, 2 June 2020

పెళ్లి పీటలు ఎక్కుతోన్న సునీల్ హీరోయిన్.. బిజినెస్‌మేన్‌తో ఇటీవల నిశ్చితార్థం

‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో సునీల్ సరసన హీరోయిన్‌గా నటించిన మలయాళ నటి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వారి నిశ్చితార్థం జరిగిపోయిందని మలయాళ మీడియా ఖరారు చేసింది. ప్రస్తుతం కరోనా భయానక పరిస్థితులు ఉండటంతో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. నిజానికి కేరళలోని కొట్టాయంలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించడానికి మియా, అశ్విన్ కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారట. కానీ, కరోనా ఆ ప్రణాళికలను నాశనం చేసింది. దీంతో ఎంగేజ్‌మెంట్‌ను సింపుల్‌గా జరుపుకోవాల్సి వచ్చిందట. Also Read: మియా, అశ్విన్‌ల పెళ్లికి సెప్టెంబర్‌లో ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి తేదీని ఇరు కుటుంబాలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ కుటుంబంలోని కొంత మంది ద్వారా ఈ విషయం బయటికి వచ్చిందని అంటున్నారు. ఆ సమయానికి ఈ కరోనా భయం వదిలిపోతే పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారట. కాగా, తన పెళ్లి విషయంపై మియా క్లారిటీ ఇచ్చారు. నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది, పెళ్లి ఎప్పుడు అనే విషయాలు ప్రస్తావించకపోయినప్పటికీ.. తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మాపై చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ధన్యవాదాలు’ అని ఈ పోస్ట్‌లో రాశారు. ఇక మియా కెరీర్ విషయానికి వస్తే.. 2010లో ఆమె మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘ఒరు స్మాల్ ఫ్యామిలీ’ సినిమాతో నటిగా ఆరంగేట్రం చేశారు. అయితే, హీరోయిన్‌గా అవకాశం దక్కడానికి ఐదారు సినిమాలు చేయాల్సి వచ్చింది. ‘చెట్టయీస్’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా మారారు. ఈ సినిమాలో లాల్, బిజు మీనన్, సురేష్ కృష్ణ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. మియా తెలుగులో నటించిన ఏకైక చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. మలయాళం తరవాత తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తమిళ సినిమా, రెండు మలయాళ సినిమాలు ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XojZgI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...