Saturday, 6 June 2020

ఇల్లు ఊడుస్తున్న మహేష్ బాబు కూతురు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఫేమస్ అయ్యాడో..ఆయన కూతురు కూడా అంతే ఫేమస్. తండ్రికి తగ్గ కూతురులా సోషల్ మీడియాలో సితారం సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ సితార కూడా షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా సితార ఇంట్లో పని చేస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. ఇల్లు తుడుస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. `అమ్మకు సహాయం చేద్దాం. నిజానికి ఇల్లు తుడవడం చాలా సరదాగా ఉంటుంది. మా అమ్మకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే వారం మరో టాస్క్` అంటూ సితార కామెంట్ చేసింది. ఇప్పుడు సితార ఇల్లు ఊడ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అనేక మంది మహేష్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అంతా తమ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు.ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు పూర్తిగా తన కుటుంబం కోసమే కేటాయించాడు. తన పిల్లలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. నమ్రత కూడా మహేష్ , గౌతమ్, సితారకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక మహేష్ కూడా పిల్లలతో ఎంతో జాలిగా గడుపుతున్నారు. గౌతమ్, సితారతో ఆటలాడుతూ పలు వీడియోలు ఇప్పటికే పోస్టు చేశారు. ఇంటితో పాటు అనేక సామాజిక అంశాల పట్ల కూడా మహేష్ స్పందిస్తున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆయన పలు ట్వీట్లు చేశారు. అమెరికాలో జరిగిన నల్లజాతీయుడి దాడిపై కూడా ప్రిన్స్ స్పందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A7z6Cu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...