'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ తర్వాత ''తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ . పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ప్రీ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. ప్రస్తుతం ఇతర నటీనటులు, హీరోయిన్ ఎంపికలో నిమగ్నమైన దర్శకనిర్మాతలు మహేష్ సరసన స్టార్ డైరెక్టర్ కూతురుని హీరోయిన్‌గా ఫైనల్ చేశారని తెలుస్తోంది. మొదటి 'సర్కారు వారి పాట'లో మహేష్ సరసన కియారా అద్వానీ నటించనుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక మందన పేరు కూడా వినిపించింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్ బాబు సరసన దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌ని ఫైనల్ చేశారనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. ఫైనల్ డిసీజన్ తీసుకుందని తెలుస్తోంది. Also Read: లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అన్ని షూటింగ్స్ అతిత్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూట్‌పై కసరత్తులు ప్రారంభించారు మేకర్స్. అన్నీ కుదిరితే అతి త్వరలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30dZdCr
v
No comments:
Post a Comment