Friday, 5 June 2020

‘A’ టీజర్.. తెల్లతీరలో నలిగిన మల్లెపూలు.. ఆ బాలిక ఏమైంది?

కొత్తగా పెళ్లైన జంట.. శోభనం గదిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. నలిగిన మల్లెపూల మధ్య అలసిన శరీరాలతో సేదతీరుతూ ఉన్న నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రానిలు సినిమా టైటిల్ ‘A’కి న్యాయం చేసేట్టుగానే కనిపించారు. అయితే టీజర్ మొదలైన తరువాత ఇదో సైకిలాజికల్ థ్రిల్లర్ అని టీచర్‌ను ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు యుగంధర్. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సైకిలాజికల్ థ్రిల్లర్ మూవీ A (ఏ డి ఇన్ఫినిటమ్) టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కూరా సంగీతం అందించారు. విభిన్న కాన్సెప్ట్‌లో సైకిలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తిరేపే విధంగా ఉంది. భార్య, భర్త వాళ్లకు ఓ చిన్న పాప.. హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితంలో పాప మిస్సింగ్‌.. ఒకదానికి తరువాత మరొకటి ఎదురయ్యే వరుస ఇబ్బందులు వీటన్నింటికీ కారణం ఎవరు? ఏమిటి? అన్న కథాంశంతో A (ఏ డి ఇన్ఫినిటమ్) చిత్రాన్ని రూపొందించారు. తాజా టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dCiz7Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...