Wednesday, 27 May 2020

మహేష్ కొత్త సినిమా టైటిల్ ‘సర్కార్ వారి పాట’

సూపర్ స్టార్ పరుశురాం డైరెక్షన్‌ళో కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై రోజుకో అప్ డేట్ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదే సమయంలో ఈ సినిమాకి అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్‌ని బట్టి చూస్తుంటే మహేష్ కొత్త సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని అర్ధమవుతుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందనేది మాత్రం తెలియాలంటే కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే మహేష్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. ఇక మరోవైపు మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ భావించారు. భరత్ అనే నేనులో ఇప్పటికే కియారా... మహేష్‌తో కలిసి నటించింది. అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమా కోసం మరో హీరోయిన్‌ను కూడా వెతికే పనిలో పడింది మూవీ యూనిట్. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులని అలరించింది. సంక్రాంతి పండగకు కలెక్షన్స్ వర్షం కురిపించింది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2THDAq4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...