Sunday, 3 May 2020

ఎప్పటినుంచో ఆ అలవాటుంది.. రోజూ చేస్తా.. రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ కామెంట్స్

సినిమా హీరోయిన్లన్నాక అందం ఎంత ప్రధానమో ఫిట్‌నెస్ అనేది కూడా అంతే ముఖ్యం. అందులోనూ నేటి పోటీ ప్రపంచంలో హీరోయిన్లకు ఫిట్‌నెస్ మరీ ముఖ్యమైన అంశంగా మారింది. అందాల ఆరబోత చేయాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే కాబట్టి యోగా, వ్యాయామం లాంటివి నిత్యం చేస్తూనే ఉంటారు హీరోయిన్స్. అందంతో పాటు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఛాన్సులు పట్టేస్తుంటారు. నేటి హీరోయిన్స్ అందరూ ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెడుతుండగా రకుల్ మాత్రం మరీ ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఆమె సోషల్ మీడియా వాల్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమెకు అదే ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికర సమాధానమిచ్చింది రకుల్. రోజూ వర్కవుట్లు చేస్తుంటారు కదా? బోర్‌ అనిపించదా? అనే ప్రశ్నపై స్పందించిన ఆమె.. రోజూ భోజనం చేస్తాం. అది బోర్‌ అనిపించదు కదా, అలాగే వర్కవుట్లు కూడా అంటూ తనదైన కోణంలో రియాక్ట్ అయింది. వర్కవుట్లు అనేవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూనే అందంగా చూపిస్తాయి కూడా అని చెప్పింది. అయినా సినిమాల్లోకి రాకముందు నుంచే నాకీ అలవాటుంది ఇప్పుడు మానమంటే ఎలా? అస్సలు మానను అనేసింది రకుల్. వ్యాయామం, వర్కవుట్స్ విషయంలో కొందరు రోజూ ఏం చేస్తాంలే.. ఈ ఒక్కరోజు మానేద్దాం అని బద్దకిస్తుంటారు. అదే వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతుంది. మన ఆరోగ్యం కోసం రోజులో గంట సేపన్నా కేటాయించలేకపోతే మన జీవితమే వేస్ట్ అంటూ వర్కవుట్స్ అంటే తనకెంత ఇష్టమో చెప్పకనే చెప్పింది . తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న రకుల్ చివరగా మన్మథుడు 2 సినిమాలో కనిపించింది. కాగా రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నానని మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాల్సి ఉందని రకుల్ పేర్కొంది. అలాగే తెలుగులోనూ ఓ సినిమా ఒప్పుకోవడం జరిగిందని, త్వరలోనే ఆ సినిమా ఏంటో మీ అందరికీ తెలుస్తుందంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది రకుల్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WpHiVG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...