ఇటీవలే ‘మహానటి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు హీరోగా అదే లెవెల్ మూవీ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. అయితే ఈ లాక్‌డౌన్ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కథను మరింత సానబడుతున్నారట నాగ్ అశ్విన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ హంగులతో నిర్మించనున్న ఈ సినిమాను అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా నాగ్ అశ్విన్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చిత్ర నటీనటులు మొదలుకొని, నిర్మాణ విలువల వరకు ఎక్కడా తగ్గకూడదని భావిస్తున్నారట. ఈ మేరకు ప్రస్తుతం చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్‌ను సంప్రదిస్తున్నారట. ఇప్పటికే వారితో ఫోన్ సంప్రదింపులు జరిగాయని, లాక్‌డౌన్ పూర్తికాగానే రెమ్మ్యూనరేషన్ తాలూకు విషయాలు మాట్లాడి ఫైనల్ చేయనున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇకపోతే హీరోయిన్స్ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన, ఓ హీరోయిన్‌గా కియారా అద్వానీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీకి భారీ హంగులు జోడించాలని, ఈ మేరకు కేవలం వీఎఫ్ఎక్స్ పనుల కోసమే 50 కోట్లు కేటాయించాలని నిర్ణయానికి వచ్చారట. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటనే ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసి ఈ ఏడాది డిసెంబర్ లోనే ప్రభాస్‌ని కెమెరా ముందుంచాలని నాగ్ అశ్విన్ ఫిక్స్ అయ్యారట. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కెరీర్‌లో ఈ మూవీ మరో మైలురాయి కానుందని అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ఫినిష్ కాగానే నాగ్ అశ్విన్‌తో సినిమా ప్రారంభించనున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c0h7LY
v
No comments:
Post a Comment