Tuesday, 5 May 2020

ప్రత్యేక‌మైన రోజున ట్విట్టర్‌లో చేరిన నారా రోహిత్‌

నారా రోహిత్ ఎప్పటికీ గుర్తుంచుకొనే ప్రత్యేక‌మైన రోజు మే 5. ఆయ‌న న‌టించిన మొద‌టి చిత్రం ‘బాణం’ 2009లో మొద‌లైంది ఈ రోజే. ఈ ప్రత్యేక రోజున నారా రోహిత్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు. @IamRohithNara అనే హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో అడుగుపెట్టిన ఆయ‌న.. ‘బాణం’ మూవీ సెట్స్‌పై తొలి రోజు నాటి త‌న ఫొటోగ్రాఫ్‌ను పోస్ట్ చేశారు. త‌న తొలి ట్వీట్‌ను త‌న మెంటార్‌, పెద‌నాన్న చంద్రబాబునాయుడు, క‌జిన్ నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు. ‘‘2009లో ఈ రోజు, ఇది ‘బాణం’ మూవీలో నా ఫ‌స్ట్ షాట్‌. ఈ సంద‌ర్భంగా నా మెంటార్‌, పెద‌నాన్న చంద్రబాబునాయుడు గారు, డియ‌రెస్ట్ లోకేష్ అన్న స‌ర‌స‌న ట్విట్టర్‌లో జాయిన్ అవ‌డం గౌరవంగా, ఆనందంగా ఉంది. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు, కుటుంబం అనేది జీవశాస్త్రం కాదు, అది ఒక విశ్వాసం’’ అంటూ నారా రోహిత్‌ త‌న తొలి ట్వీట్‌ను పోస్ట్ చేశారు. రోహిత్‌కు స్వాగతం చెబుతూ నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, త‌న త‌దుప‌రి సినిమా కోసం స‌న్నగా, ఫిట్‌గా త‌యార‌య్యారు నారా రోహిత్‌. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంత‌రం ఆ సినిమాను అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారా రోహిత్ చివరిగా ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో కనిపించారు. ఆయనతో పాటు ఈ సినిమాలో శ్రీవిష్ణు, శ్రియ, సుధీర్ బాబు కూడా నటించారు. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WsVgq2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...