Thursday, 7 May 2020

రష్మిక మందన క్వారంటైన్ లుక్.. చిట్టిపొట్టి బట్టల్లో మెరిసిపోతోంది!

రష్మిక మందన.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్. ఆమెకు అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్. ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో అందరు సినిమా తారలు మాదిరిగానే రష్మిక కూడా ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే, తాజాగా రష్మిక ట్విట్టర్‌లో షేర్ చేసిన తన క్వారంటైన్ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రష్మిక క్వారంటైన్ లుక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫొటోలో ఆమె చిట్టిపొట్టి బట్టల్లో మెరిసిపోతున్నారు. సింపుల్‌గా మెట్లపై కూర్చొని జుట్టు సర్దుకుంటున్నారు. కాగా, రష్మిక ఈ ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలతో మంచి జోరుమీదున్నారు. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు చేసి రష్మిక విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో బన్నీ సరసన నటించబోతున్నారు. ఇందులో రష్మికది డీగ్లామరస్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ పూర్తికాగానే ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో రష్మిక పాల్గొంటారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dmzCKM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...