Wednesday, 6 May 2020

ఇబ్బందుల్లో సంగీత దర్శకుడు చక్రి కుటుంబం.. సాయం చేసిన మహిళా నిర్మాత

సంగీత దర్శకుడు చక్రి గురించి పరిచయం అవసరంలేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మ్యూజికల్ హిట్ చిత్రాలను అందించిన చక్రి.. 2014 డిసెబర్‌లో అకస్మాత్తుగా కన్నుమూశారు. తన ఇంట్లో నిద్రలోనే చక్రి మరణించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన చక్రి ఆర్థికంగా బాగా స్థిరపడలేకపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు, చక్రి మరణం తరవాత ఆయన కుటుంబం చీలిపోయింది. చక్రి భార్య, తమ్ముడు మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్తుల విషయంలో వివాదం చెలరేగింది. వీరిద్దరూ మీడియాకు ఎక్కారు. చక్రి మరణం తరవాత వీరు విడివిడిగా ఉంటున్నారు. చక్రి సోదరుడు మోహిత్ తల్లితో కలిసి మణికొండలో ఉంటున్నారు. మహిత్ దివ్యాంగుడనే విషయం తెలిసిందే. ఈయన కొన్ని చిన్న సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ, తన అన్నయ్య మాదిరిగా సక్సెస్ కాలేకపోయారు. అయితే, ప్రైవేట్ ఆల్బమ్‌లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆయనకు సంపాదన లేకుండా పోయింది. దీంతో ఈ తల్లీకొడుకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ కాస్ట్యూమ్‌ డిజైనర్, నిర్మాత డాక్టర్‌ అనూహ్యా రెడ్డి వారికి సాయం అందించారు. వారికి రెండు నెలలకు సరి పడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. లాక్‌‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్‌’ సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలే డాక్టర్‌ అనూహ్యా రెడ్డి. గత నెల రోజులుగా ఈ సంస్థ నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కోడిగుడ్లు, ప్యాకేజ్‌డ్‌ ఆహారాన్ని పేదలకు అందజేస్తోంది. మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు చక్రి కుటుంబం పడుతోన్న ఇబ్బందులు గురించి తెలుసుకుని స్వయంగా అనూహ్యా రెడ్డి వారి ఇంటికి వెళ్లి సాయం అందించారు. అంతేకాకుండా, లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న మహిత్‌ను కరోనాపై ఒక ట్యూన్ చేయాలని అనూహ్యా రెడ్డి కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ccBe9N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...