Wednesday, 27 May 2020

టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు అరెస్ట్

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఓ యువతి ఆయనపై ఫిర్యాదు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చోట కె నాయుడుకి సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పనిచేశారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తాజాగా శ్యామ్ కె నాయుడుపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని చెప్పి సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TYi6p9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...