Wednesday, 27 May 2020

స్టార్ హీరో టీనేజ్ ఫోటో .. సోషల్ మీడియాలో వైరల్

లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. వారికి సంబంధించిన తీపి గుర్తులు, చిన్ననాటి ఫోటోలు, టీనేజ్ ఫోటోలు ఇలా వారికి సంబంధించిన పాత మెమోరీస్‌కి అన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇవి ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టీనేజ్ ఫోటో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది. బాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన ... ముందుగా బుల్లితెర ద్వారా తన కెరియర్‌ను ప్రారంభించారు. 1980లో టీవీ సీరియల్ ద్వారా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. షారూఖ్ ఖాన్ 1988లో వచ్చిన ఫౌజీ అనే చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన షారూఖ్‌.. 1992లో దివానా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. షారుఖ్ న్యూ ఢిల్లీలోని 1965 నవంబర్ 2న పుట్టారు. సెయింట్ కొలుంబస్ స్కూల్‌లో చదివారు. అప్పుడు తన క్లాస్‌మేట్స్‌తో కలిసి ఫోటో దిగాడు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతోంది. బూడిద రంగు సూట్‌లో ఉన్న షారూఖ్ లుక్ ఫ్యాన్స్‌కి థ్రిల్‌ని కలిగిస్తుంది. కాగా, కెరీర్‌లో అద్భుతమైన సినిమాలు చేస్తూ వచ్చిన షారూఖ్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. చివరిగా జీరో సినిమాలో నటించిన ఆయన తన తర్వాత సినిమా కోసం కథలు వింటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c9XRL3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...