Wednesday, 27 May 2020

‘మ్యాడ్’ మూవీలో కైలాష్ ఖేర్ పాడిన సుఫీ పాట.. కొత్తగా ఉంది!

ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫ‌స్ట్ లుక్‌తో ఎట్రాక్ట్ చేసిన ‘మ్యాడ్’ మూవీ ఈసారి సుఫీతో త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంది. తెలుగు పాట‌ల‌లో చాలా అరుదుగా క‌నిపించే సుఫీ పాట‌ ‘మ్యాడ్’కి ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలవనుంది. ‘‘బందిషీ ఖాత‌ల్ దిల్ కీ’’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ గొంతులో ప్రాణం పోసుకుంది. సింగ‌ర్‌గా ఇండియ‌న్ మ్యూజిక్‌పై చెరిగిపోని సంత‌కం చేసిన కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్షకుల మ‌న‌సులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వర ప‌ర‌చిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమ‌న‌స్వి ర‌చించారు. మోదెల టాకీస్ బ్యాన‌ర్‌పై టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి, వారి మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు. పాట విడుదల సంద‌ర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. ‘‘కైలాష్ ఖేర్ గారు మా పాట‌ను ఒప్పుకోవ‌డం చాలా అదృష్టంగా భావించాం. సినిమాలో ఒక ఎమోష‌న‌ల్ సిట్యువేష‌న్‌లో ఈ పాట వ‌స్తుంది. క‌థలోని ఫీల్‌ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సుఫీ అయితే కొత్తగా ఉంటుంది, చాలా ప్రెష్ ఫీల్ క‌లుగుతుంద‌ని అనుకున్నాం. మా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ చాలా హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంది. కైలాష్ ఖేర్ గారి పాట విన్నాక మాకు క‌లిగిన ఆనందం అంతా ఇంతాకాదు. సినిమాకు ఈ సాంగ్ హైలెట్‌గా మారుతుంద‌ని మా న‌మ్మకం. ఒక రియ‌లిస్టిక్ అప్రోచ్‌లో క‌థా, క‌థ‌నాలు సాగుతాయి. ఈ జ‌న‌రేష‌న్ ప్రేమ‌క‌థ‌ల‌లో మ‌నం నిత్యం చూసే క‌థ‌లే ఇందులో చూపించాం’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yzYfVy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...