Friday, 8 May 2020

డైరెక్టర్‌గా మారిన ఎన్టీఆర్ విలన్.. బిగ్ బాస్ షోపై సినిమా

నటులు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. టాలీవుడ్‌లో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నటీనటులు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. భానుమతి, ఎన్టీఆర్, కృష్ణ, విజయనిర్మల దగ్గర నుంచి అవసరాల శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్ వరకు చాలా మంది సినీ తారలు మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇప్పుడు మరో నటుడు దర్శకుడిగా మారుతున్నారు. ‘హ్యాపీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ నటుడు ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బ్లాక్ అండ్ వైట్’ అనే కన్నడ, తమిళ ద్విభాషా చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటించారు కూడా. కిశోర్‌తో పాటు రోజర్ నారాయణ్, శ్రీకృష్ణ దయాళ్, సురేఖ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమాకు ముందు వేరే దర్శకుడిని అనుకున్నారు. అయితే, ఆయన స్క్రిప్ట్‌లో మార్పులు చేయడంతో కిశోర్‌కు నచ్చలేదు. దీంతో ఆయనే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. విజయవంతంగా పూర్తిచేశారు. Also Read: ఈ సినిమా దంపతుల కథ. బిగ్ బాస్ రియాలిటీ షో కారణంగా వారి మధ్య విభేదాలు వస్తాయి. ఆ తరవాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. సినిమా మొత్తాన్ని ఒకే ప్రాంతంలో షూట్ చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. ‘హ్యాపీ’ సినిమాలో ఏసీపీ రత్నంగా నటించి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్.. ఆ తరవాత ‘పిస్తా’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ‘దమ్ము’లో ఎన్టీఆర్‌కు విలన్‌గా నటించారు. ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కార్తికేయ’, ‘చీకటి రాజ్యం’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘దొరసాని’, ‘అర్జున్ సురవరం’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన తెలుగులో చివరిగా ‘వెంకీ మామ’ చిత్రంలో కనిపించారు. ఆర్మీ ఎపిసోడ్‌లో మేజర్‌ అన్వర్ సాదత్ పాత్రలో కిశోర్ కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L8pQA1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...