Wednesday, 6 May 2020

హాస్పిటల్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. ఆందోళనలో కంటెస్టెంట్లు

బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సంభావన సేథ్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల వ్యవధిలో ఆమె రెండు సార్లు హాస్పిటల్‌లో చేరారు. సంభావన హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని ఆమె భర్త అవినాష్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘సంభావన అనారోగ్యానికి గురికావడంతో నిన్న రాత్రి హాస్పిటల్‌లో చేర్పించాం. ఈరోజు ఉదయం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాం. అయితే, ఇప్పుడు మరోసారి ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాం’ అని తన పేరిట సంభావన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే పోస్ట్ చేశారు అవినాష్. ఆమె హాస్పిటల్‌లో చేరడం వల్ల ఈరోజు తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పబ్లిష్ చేయలేదని అవినాష్ స్పష్టం చేశారు. Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అవినాష్ పోస్ట్ చూసిన కొంత మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు కంగారు పడ్డారు. అలాగే, ఆమె ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా ఆందోళనకు గురయ్యారు. ‘‘మాకు చాలా కంగారు ఉంది. నాకు ఒకసారి కాల్ చేయ్ అవినాష్’’ అని బిగ్ బాస్ 1 ఫేమ్ కశ్మీరా షా ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇచ్చారు. అలాగే నటి కమ్యా పంజాబీ, నటి సోనాలి రౌత్, నటి గుంజన్ పంత్ కూడా అవినాష్ పోస్ట్‌కు స్పందించారు. సంభావన త్వరగా కోలుకోవాలని వీరంతా కామెంట్లు పెట్టారు. చాలా కంగారుగా ఉందని, ఆమెకు ఏమీ కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. వీరంతా సంభావనతో కలిసి బిగ్ బాస్‌ షోలో పాల్గొన్నారు. కాగా, ప్రస్తుతం సంభావన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిసింది. సంభావన, అవినాష్ దంపతులు ముంబైలో నివాసం ఉంటున్నారు. 2016 జులైలో వీరి వివాహం జరిగింది. సంభావన పలు రియాలిటీ షోలలో పాల్గొన్నారు. ‘డ్యాన్సింగ్ క్వీన్’, ‘దిల్ జీతేగి దేశి గర్త్’, ‘వెల్‌కమ్ - బాజి మెహ్మాన్ నవాజి కి’’ వంటి షోలతో సంభావన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ‘రజియా సుల్తాన్’, ‘లాల్ ఇష్క్’ వంటి టీవీ షోలలో కూడా సంభావన మెరిశారు. అంతేకాకుండా పలు బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆమె స్టెప్పులేశారు. సంభావన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. బిగ్ బాస్ 2తో పాటు బిగ్ బాస్ 8లోనూ సంభావన పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cbuZ5Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...