ఆపత్కాల సమయంలో సాటి మనిషికి సాయం చేసినవాడే దేవుడు. అందరూ అంగీకరించే అక్షర సత్యం ఇది. ఆపదలో ఉన్నప్పుడు ఆకలి తీర్చిన ఆ చేయిని ఎన్నటికీ మరువలేవు సాయం అందుకున్న హృదయాలు. ప్రస్తుతం నెలకొన్న ఈ కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో అలాంటి గొప్ప పనులు చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు కొందరు గొప్ప మనుషులు. అందులో ఒకరే హీరోయిన్ . చిన్న హీరోయిన్ అయినప్పటికీ పెద్ద హీరోయిన్లు ఆదర్శంగా తీసుకునే పనులు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కరోనా కారణంగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తున్న పేద వాళ్ళ సహాయార్థం నడుం బిగించింది ప్రణీత. తానే స్వయంగా వంట చేసి, ఆ వంటకాలను ప్యాకెట్ల రూపంలో పేదవారికి చేరవేస్తోంది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఈ 21 రోజుల్లోనే 75 వేల ఆహార పొట్లాలను అందించి ఆకలి తీర్చింది. ఈ మేరకు ముఖానికి మాస్కు ధరించి వంట చేస్తున్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రణీత. ఇదివరకే సినీ రంగంలో పనిచేసే యాభై కుటుంబాల సహాయార్ధం లక్ష రూపాయల విరాళం అందించిన ప్రణీత.. మరోసారి ఇలా తన గొప్పమనసు చాటుకుంది. ఆమె చేస్తున్న ఈ మంచి పనులు చూసి టాలీవుడ్ పెద్దలతో పాటు అశేష ప్రేక్షకలోకం పొగడ్తలతో ముంచెత్తుతోంది. ప్రణీతను చూసి పెద్ద హీరోయిన్స్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రణీత. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35dqeWX
v
No comments:
Post a Comment